: రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే వారిలో అధికులు నల్లధనవంతులే: అక్బరుద్దీన్ ఒవైసీ

రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే వారిలో అధికులు నల్లధనవంతులేనని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. పెద్దనోట్ల రద్దుపై తెలంగాణ అసెంబ్లీలో చేపట్టిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో చాలా రాజకీయపార్టీలు నగదు వసూలు చేస్తున్నాయని, ఇది అవినీతి కాదా? అని  ప్రశ్నించారు. రాజకీయ పార్టీల పేరిట నగదు వసూలుకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని సూచించారు. పెద్దనోట్ల రద్దుతో దేశంలో ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని, ఇది ముమ్మాటికి ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని అన్నారు. దేశంలో బీజేపీ ఏది చెబితే అదే జాతీయవాదం.. బీజేపీని వ్యతిరేకిస్తే దేశద్రోహం అనే ధోరణి కొనసాగుతోందని విమర్శించారు. బీజేపీకి కేసీఆర్ వకాల్తా పుచ్చుకున్నట్లు వ్యవహరిస్తున్నారని, తెలంగాణలో తొమ్మిది వేల గ్రామాలు ఏటీఎంల పరిధిలో లేవని, బ్యాంకులు, తపాలా కార్యాలయాలు లేని గ్రామాలు నాలుగు వేలకు పైగా ఉన్నాయని అన్నారు.  

More Telugu News