parliament: ప్రారంభ‌మైన పార్ల‌మెంటు ఉభ‌య‌స‌భ‌లు.. ఆఖ‌రి రోజున కూడా అదే తీరు.. లోక్‌స‌భ వాయిదా

పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాల్లో చివ‌రిరోజు ఉభ‌య‌స‌భ‌లు ప్రారంభ‌మ‌య్యాయి. శీతాకాల స‌మావేశాల్లో మొద‌టి రోజు నుంచి పెద్దనోట్ల ర‌ద్దుపై విప‌క్ష పార్టీలు గంద‌ర‌గోళం సృష్టిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో వాయిదాల ప‌ర్వ‌ం కొనసాగుతోంది. ఆఖరి రోజయిన ఈ రోజు కూడా లోక్‌స‌భ ప్రారంభ‌మైన ఐదు నిమిషాల‌కే వాయిదా ప‌డింది. పెద్ద‌నోట్ల ర‌ద్దుపై చ‌ర్చ‌కు విప‌క్ష స‌భ్యులు ప‌ట్టుబ‌ట్టి నినాదాలు చేయ‌డంతో స్పీక‌ర్ సుమిత్రా మహాజ‌న్ స‌భ‌ను ఈ రోజు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. రాజ్య‌స‌భ‌లోనూ పెద్ద‌నోట్ల ర‌ద్దుపై చ‌ర్చ చేప‌ట్టాల్సిందేన‌ని విప‌క్ష స‌భ్యులు ప‌ట్టుబ‌డుతున్నారు.

More Telugu News