: న్యూ ఇయర్ వేడుకలు: సన్నీలియోన్ డ్యాన్స్ కు 4 కోట్లు?

2016 ముగిసిపోతోంది. పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ, నూతన సంవత్సరానికి ఆనందంగా స్వాగతం పలకడానికి స్టార్ హోటళ్లు పలు ఏర్పాట్లు చేస్తుంటాయి. అందులో భాగంగా సినీ నటులతో వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. దీనిని క్యాష్ చేసుకునేందుకు దేశవ్యాప్తంగా ఉన్న సినీ పరిశ్రమల్లోని నటుల మేనేజర్లు రేట్లు ఫిక్స్ చేసి, సంప్రదింపులు జరుపుతుంటారు. ఈ ఏడాది కూడా ఓ స్టార్ హోటల్ డిసెంబర్ 31 అర్ధరాత్రి గానాబజానాకు ఏర్పాట్లు చేసుకుంది. అందులో భాగంగా సన్నీలియోన్ ను సంప్రదించింది. దానికి వెంటనే సన్నీ అంగీకరించింది. తాజాగా విడుదలైన 'రయీస్' సినిమాలోని 'లైలా ఓ లైలా' పాటకు స్టెప్పులు వేయాలని కోరిందని తెలుస్తోంది. ఇందుకు గాను ఆమెకు 4 కోట్ల రూపాయలు చెల్లించనున్నట్టు బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. 

More Telugu News