: నా శ్రమ, సామర్థ్యం, పోరాటం, బలం 17న చూస్తారు: విజేందర్ సింగ్

తన అంకిత భావం, కఠిన శ్రమ, సామర్థ్యం, బలం తదితరాలను డిసెంబర్ 17న చూస్తారని భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ తెలిపాడు. నిన్న బాక్సర్ల పరిచయ కార్యక్రమం సందర్భంగా ఫ్రాన్సిస్ ఛెకా విజేందర్ ను నెట్టడంతో విజేందర్ బలంగా ఛెకాను తొసేశాడు. అనంతరం బౌట్ లో తేల్చుకుందామంటూ ఛెకా, విజేందర్ సవాళ్లు విసురుకున్నారు. ఈ నేపథ్యంలో సుదీర్ఘ కెరీర్ కలిగిన తాను విజేందర్ ను బాక్సింగ్ రింగ్ అంటే భయపడేలా చేస్తానని ఛెకా హెచ్చరించిన సంగతి తెలిసిందే.

 ఈ నేపథ్యంలో విజేందర్ మాట్లాడుతూ, ఛెకా కఠినమైన ప్రత్యర్థి అని తనకు తెలుసని అన్నాడు. అందుకే ప్రముఖ స్ట్రెంత్ ట్రైనర్ జాన్ జాయ్స్ ఆధ్వర్యంలో విజేందర్ శిక్షణ పొందాడు. ఆయనకు సాకర్ స్టార్లు, బాక్సర్లకు శిక్షణనిచ్చిన అనుభవముందని తెలిపాడు. ఛెకా అనుభవశాలి అన్న విషయం తనకు తెలుసని, అయితే తాను యువకుడిని, ఆకలిగొన్న పోరాటయోధుడ్ని, గతంలో కంటే బలంగా కనిపిస్తున్నానని, డిసెంబర్ 17న విజయం తనదేనని విజేందర్ ఢంకా బజాయించి చెబుతున్నాడు. ఈ మ్యాచ్ ను పలువురు క్రీడా, సినీ, రాజకీయ స్టార్లు ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. 

More Telugu News