: ఐదు స్మార్ట్ సిటీలకు ఏపీ కేబినెట్ ఆమోదం

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తరహాలో రాష్ట్రంలో స్మార్ట్ సిటీ పథకాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ పథకంలో ఐదు జిల్లా కేంద్రాలను స్మార్ట్ గా తయారు చేయాలని నిర్ణయించినట్టు కేబినెట్ తెలిపింది. ఇందులో భాగంగా ఏలూరు, నెల్లూరు, ఒంగోలు, కర్నూలు, అనంతపురం పట్టణాలను స్మార్ట్ గా తయారు చేయాలని నిర్ణయించారు. అలాగే శ్రీకాకుళం పట్టణాన్ని కూడా స్మార్ట్ గా తయారు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. విజయవాడలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ లోని 27 ఎకరాలను పీపీపీ పధ్ధతిలో బహుళ అంతస్తుల మాల్ ను నిర్మించేందుకు నిర్ణయించినట్టు తెలిపారు. 

More Telugu News