: మద్యం దుకాణాల్లో ఆన్ లైన్ చెల్లింపులు పెరగడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది: సీఎం చంద్రబాబు

మద్యం దుకాణాల్లో ఆన్ లైన్ చెల్లింపులు పెరగడం అన్నది ఆశ్చర్యానికి గురిచేస్తోందని, అదేవిధంగా అన్ని వ్యాపారాల్లోనూ డిజిటల్ లావాదేవీలు పెరగాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సూచించారు. ఏపీ సచివాలయంలో వివిధ శాఖాధిపతులతో  నిర్వహించిన సమావేశంలో నగదు రహిత లావాదేవీలపై ఆయన ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, నోట్ల రద్దు కష్టాలతో ప్రజలు ప్రయాణాలు, పనులు మానుకుంటున్నారని అన్నారు.

అయితే, మద్యం దుకాణాల్లో మాత్రం ఆన్ లైన్ చెల్లింపులు పెరుగుతున్నాయని, అన్ని వ్యాపారాల్లో కూడా అదేవిధంగా డిజిటల్ లావాదేవీలు పెరగాలని అన్నారు. ఐఏఎస్ అధికారుల్లో ఎంతమంది మొబైల్ బ్యాంకింగ్ కు మారారో చెప్పాలని చంద్రబాబు అడిగారు. రాష్ట్ర స్థాయి అధికారులే 20 శాతానికి మించి ఆన్ లైన్ చెల్లింపులు చేయడం లేదని అన్నారు. ఈ సందర్భంగా శేఖర్ రెడ్డి ఇంట్లో కొత్త నోట్ల వ్యవహారం అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఇటువంటి సంఘటనలు వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని పోగొడతాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

More Telugu News