dhoni captaincy: వాట్ టు డూ?.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ కు పరీక్షా సమయం!

టీమిండియా చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ కు పరీక్షా సమయం ఆసన్నమైంది. అండర్ 19, ఇండియా 'ఏ' జట్లు పటిష్ఠంగా ఉన్నాయి. రంజీల్లో ఆటగాళ్లు టన్నుల కొద్దీ పరుగులు చేస్తున్నారు. దీంతో టీమిండియా రిజర్వ్ బెంచ్ పటిష్ఠంగా ఉంది. ఇంకా జట్టు ప్రయోజనాల కోసం రాహుల్ ద్రవిడ్ సహకారం కావాలన్నా ఇస్తాడు. ఇలాంటి నేపథ్యంలో ఎమ్మెస్కేకి జట్టు ఎంపిక పెద్ద పరీక్ష కాదు. జట్టు నుంచి ఆటగాళ్లకు ఉద్వాసన పలకడమే సిసలైన పరీక్ష. యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్, ఇషాంత్ శర్మ వంటి ఆటగాళ్లు సీనియర్లైపోయారు. వీరింకా జట్టులో చోటుకోసం ప్రయత్నిస్తున్నారు.

ఇదే సమయంలో సంజు శాంసన్, మయాంఖ్ అగర్వాల్, సర్ఫరాజ్ ఖాన్, యజువేంద్ర చాహల్, మనీష్ పాండే, సూర్యకుమార్ యాదవ్, ఉనద్కత్, సౌరవ్ తివారీ తదితరులు అవకాశాల కోసం వేచి చూస్తున్నారు. దీంతో సీనియర్లను తొలగించి, వారి స్థానాలను వీరితో భర్తీ చేయడం ఎమ్మెస్కేకి పెద్ద సవాల్ కాదు. అయితే అతి ప్రధానమైన టీమిండియా కెప్టెన్ మార్పు మాత్రం చీఫ్ సెలెక్టర్ కి సవాల్ విసురుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. టెస్టుల్లో వరుస సెంచరీలు, విజయాలతో కోహ్లీ రికార్డులతో దూసుకుపోతున్నాడు. ఇదే సమయంలో ధోనీ మ్యాజిక్ పని చేయడం లేదు. అదీ కాక కోహ్లీ అసాధారణ రాణింపు నేపథ్యంలో ధోనీకి జట్టులో స్థానం కూడా సమస్యగా మారింది.

ఎవరి ఆటను వారు ప్రదర్శిస్తూ తమ పాత్రలను అద్భుతంగా పోషిస్తున్నారు. గాయాలపాలైన ఆటగాళ్లు ఫిట్ నెస్ సంతరించుకున్నప్పటికీ జట్టులో స్థానంలో కోసం పోటీ పడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ధోనీ బ్యాటు నుంచి అద్భుతమైన ఇన్నింగ్స్ లను చూసి చాలా కాలమైంది. ఈ నేపథ్యంలో ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకుని, రిటైర్మెంట్ ప్రకటిస్తే బాగుటుందని అంతా అభిప్రాయపడుతున్నారు. అయితే బయటకి మాత్రం ధోనీ జట్టుకు ఎన్నో విజయాలు అందించాడని, ఎప్పుడు రిటైర్ కావాలన్నది అతనికి తెలుసని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ధోనీకి ఉద్వాసన పలకడమే బెస్టు అనేది లోపాయకారీ మాట. ఈ నేపథ్యంలో ఈ పరీక్షా సమయాన్ని ఎమ్మెస్కే ఎలా నెట్టుకొస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. 

More Telugu News