: వేగంగా కరిగిపోతున్న హిమగిరులు...అంతరించిపోవు కదా?

మనకు ఉత్తరాన ఉన్న హిమాలయాలకు హిందూ పురాణాల్లో విశిష్టమైన స్థానం ఉంది. ఈ హిమాలయాలలోని కైలాసంలోనే పరమ శివుడు కొలువై ఉంటాడన్నది హిందువుల నమ్మకం. అటువంటి పవిత్ర హిమగిరులు కరిగిపోతున్నాయి. భూతాపం పెరిగిపోతుండడంతో వాతావరణంలో తీవ్ర మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో హిమగిరులు వేగంగా కరిగిపోతున్నాయి. ఈ విషయాన్ని అమెరికా ఉపగ్రహాలు తీసిన ఛాయాచిత్రాలు నిర్ధారిస్తున్నాయి.

హెక్సాజెన్ సందర్భంగా అమెరికా ఉపగ్రహాలు హిమాలయాలను ఫోటోలు తీశాయి. 1970-1980 మధ్య కాలంలో అమెరికా 20 భారీ నిఘా ఉపగ్రహాలను ఉపయోగించి హిమాలయాల్లోని మారుమూల ప్రాంతాల ఫోటోలు తీసింది. ఈ ప్రాజెక్టుకు హెక్సాజెన్ అని పేరు పెట్టింది. ఆ చిత్రాలను ఫిల్మ్ రూపంలో ఉపగ్రహాలు భద్రపరిచి జారవిడవగా, యుద్ధవిమానాలు వాటిని సేకరించి భద్రపరిచాయి. వీటిని 2011లో బహిర్గతం చేయగా, జియోలాజికల్ శాస్త్రవేత్తలు వీటితో తాజా ఫోటోలను పరిశీలించగా హిమాలయాలు వేగంగా కరిగిపోతుండడాన్ని గుర్తించారు. ఏడాదికి పావు మీటర్ చొప్పున హిమాలయాలు కరిగిపోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. 

More Telugu News