obama: మీ తీరు ఏం బాగోలేదు... డొనాల్డ్ ట్రంప్‌ను హెచ్చరించిన ఒబామా

అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరుపై ప్ర‌స్తుత అధ్య‌క్షుడు బ‌రాక్‌ ఒబామా ఆందోళ‌న వ్య‌క్తం చేస్తూ ఆయ‌న‌ను హెచ్చ‌రించారు. అమెరికా నిఘా సంస‍్థ (సీఐఏ)తో పాటు ప‌లు ఏజెన్సీల విషయంలో ట్రంప్‌ అనుసరిస్తున్న తీరుని ఆయ‌న ఖండించారు. ట్రంప్ క‌న‌బ‌రుస్తోన్న ధోర‌ణి ప్రమాదకరమైనద‌ని అన్నారు. అమెరికా ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఇటీవ‌ల సీఐఏ ఓ రిపోర్టునిస్తూ అమెరికాలోని డెమోక్రటిక్‌ పార్టీతో పాటు హిల్లరీ క్లింట‌న్‌ని లక్ష్యంగా చేసుకొని జరిగిన సైబర్‌ దాడులలో రష్యా పాత్ర ఉందని పేర్కొన్న విష‌యం తెలిసిందే. అయితే ఈ రిపోర్ట్‌ను డొనాల్డ్‌ ట్రంప్‌ తోసిపుచ్చారు. మ‌రోవైపు ఇరాక్‌ విషయంలోనూ ఏజెన్సీల పనితీరుపై ట్రంప్ అస‌హ‌నం వ్యక్తం చేశారు.

నిఘా సంస్థలతో స‌త్సంబంధాలు మొద‌లుపెట్టాల్సిన ట్రంప్ ఇటువంటి తీరుని క‌న‌బ‌రుస్తుండ‌డంతో ఒబామా ఓ మీడియా ప్రోగ్రాంలో మాట్లాడుతూ ఇటువంటి వ్యాఖ్య‌లు చేశారు. ట్రంప్‌ 'ఫ్లయింగ్‌ బ్లైండ్‌' విధానం అనుస‌రిస్తున్నార‌ని, అది ప్రమాదకరమైనదని ఒబామా అన్నారు. ట్రంప్‌ ఎంత స్మార్ట్‌ అనేది ప్ర‌ధాన‌మైన అంశం కాద‌ని, ఒక మంచి నిర‍్ణయం తీసుకోవడానికి బెస్ట్‌ ఇన్ఫర్మేషన్‌ను ప‌రిశీలించాల్సి ఉంటుంద‌ని ఒబామా సూచించారు.

More Telugu News