: దేవినేని ఉమ మానసిక రోగిగా మారారు: వాసిరెడ్డి పద్మ

ఏపీ మంత్రి దేవినేని ఉమ మానసిక రోగిగా మారారని, మంత్రి స్థాయిలో ఆయన మాట్లాడటం లేదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. హైదరాబాద్ లోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో ఆమె ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అడిగిన ప్రశ్నలపై మంత్రి ఉమ సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారని అన్నారు. దేవినేని ఉమకు దమ్మూ ధైర్యం ఉంటే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పురోగతి 'ఇది' అని స్పష్టంగా చెప్పాలని, సమాధానం చెప్పకుండా పళ్లు కొరికే పరిస్థితిలో ఉన్న ఉమ, మంత్రా? మానసిక రోగా? అనే విషయం తమకు అర్థం కావట్లేదని అన్నారు.

ఉమ ఇంటిపేరు.. ‘దేవినేని’ అనేది ఎప్పుడో పోయిందని, ఆ పదం స్థానంలో ‘అవినీతి’ అనేది స్థిరపడిపోయిందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలనే తాము కోరుకుంటున్నామని, ఆ ప్రాజెక్టు.. వైఎస్ రాజశేఖరెడ్డి డ్రీమ్ ప్రాజెక్టు అని వాసిరెడ్డి పద్మ అన్నారు. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురావాలని ఆలోచించలేదని అన్నారు. ‘పోలవరం’ నిర్వాసితులకు అన్యాయం చేయవద్దని, ఈ విషయాన్ని ప్రశ్నిస్తున్న జగన్ పై అవాకులు చవాకులు పేలడం సమంజసం కాదని అధికార పార్టీపై ఆమె మండిపడ్డారు.

More Telugu News