airport: విమానంలోంచి మహిళను ఈడ్చుకుంటూ లాక్కెళ్లిన ఎయిర్ పోర్టు అధికారులు

ఎయిర్‌పోర్టు వ‌ద్ద నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ప్ర‌వ‌ర్తించినందుకు గానూ ఓ మ‌హిళ‌ను విమానాశ్ర‌య అధికారులు విమానం నుంచి లాక్కెళ్లిన ఘ‌ట‌న మిచిగాన్ లోని డెట్రాయిట్ మెట్రోపాలిటన్ ఎయిర్ పోర్టులో తాజాగా చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న జ‌రుగుతుండ‌గా తీసిన ఓ వీడియో సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన అధికారులు ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు. విమానాశ్ర‌యం నుంచి బయల్దేరాల్సిన డెల్టా ఎయిర్ లైన్స్ విమానం టేకాఫ్ కు సిద్ధంగా ఉన్న సమయంలో, స‌ద‌రు మహిళ నిబంధ‌న‌ల‌ను పట్టించుకోకుండా టెర్మినల్ గేటు వద్ద బ్యాగేజీ చెకింగ్, బోర్డింగ్ వద్ద అధికారుల మాటలను వినిపించుకోకుండా విమానంలోకి వ‌చ్చింద‌ని అధికారులు పేర్కొన్నారు. ఆమెను అదుపులోకి తీసుకున్న విమానాశ్ర‌య అధికారులు ప్ర‌స్తుతం విచారణ జరుపుతున్నట్లు స‌మాచారం.

More Telugu News