injamam fear: సెహ్వాగ్ ఆడతాడంటేనే భయపడేవాడ్ని: ఇంజమామ్

పాకిస్థాన్ దిగ్గజ బ్యాట్స్ మన్ ఇంజమామ్-ఉల్-హక్ గురించి క్రికెట్ పట్ల అవగాహన వున్న ప్రతి ఒక్కరికీ తెలిసిందే. క్రీజులో నిలబడితే ప్రత్యర్థికి అంత తేలిగ్గా లొంగే రకం కాదు ఇంజమామ్. టీమిండియా అతని వికెట్ తీయడం కంటే రన్ అవుట్ చేయడాన్ని బాగా ఇష్టపడేది. భారీ కాయుడైన ఇంజమామ్ ను ఊరించే బంతితో.. ఆయన రన్ కి కోసం వికెట్ మధ్యలోకి రాగానే బోల్తా కొట్టించేవాడు.

ఇక ప్రత్యర్థులను తీవ్రమైన ఒత్తిడిలోకి నెట్టేసే ఇంజమామ్ ఒక బ్యాట్స్ మన్ అంటే మాత్రం భయపడేవాడట. జియో స్పోర్ట్స్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో ఇంజమామ్ మాట్లాడుతూ, వీరేంద్ర సెహ్వాగ్ క్రీజులోకి దిగితే భయమేసేదని తెలిపాడు. సెహ్వాగ్ అవుటైతే సరే కానీ, క్రీజులో నిలబడ్డాడంటే మాత్రం స్కోరు బోర్డు ఆగేది కాదని అన్నాడు. సెహ్వాగ్ 80 పరుగులు చేశాడంటే టీమిండియా 300 పరుగులు చేస్తుందనే భయం తనలో నెలకొనేదని చెప్పాడు. అంతే కాదని, సెహ్వాగ్ ఎంత సేపు క్రీజులో ఉంటే బౌలర్ ఆత్మవిశ్వాసం అంతగానూ దెబ్బతింటుందని అన్నాడు. అదే కెప్టెన్ గా తనను ఇబ్బందికి గురిచేసేదని అన్నాడు. 

More Telugu News