burhan vani: ఉగ్రవాది కుటుంబానికి నష్టపరిహారం ప్రకటించిన కశ్మీర్ ప్రభుత్వం!

జమ్మూకశ్మీర్ లో భద్రతాదళాల ఎన్ కౌంటర్ లో మృతి చెందిన ఉగ్రవాది బుర్హాన్ వనీ కుటుంబానికి 4 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఇదిప్పుడు పెద్ద చర్చనీయాంశం అయింది. గత జూలైలో కశ్మీర్ లోని అనంత నాగ్ వద్ద బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ తరువాత కశ్మీర్ లో అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. తాజాగా ఉగ్రవాదులకు మద్దతు పలుకుతూ ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మెహబూబా ముఫ్తీ నాయకత్వంలోని జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. కాగా, జమ్మూకశ్మీర్ లో బీజేపీ మద్దతు ఇస్తున్న ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే.  

More Telugu News