: జాతీయగీతం పాడాలన్న నిర్ణయం అర్థంపర్థం లేనిది: నటుడు అరవింద్ స్వామి

సినిమా థియేటర్లలో జాతీయగీతాన్ని ప్రదర్శించాలని... ప్రతి ఒక్కరూ లేచి నిలబడి జాతీయగీతాన్ని గౌరవించాలని ఇటీవలే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై ప్రముఖ సినీ నటుడు అరవిందస్వామి అభ్యంతరం వ్యక్తం చేశారు. క్రీడా కార్యక్రమాలు, దేశానికి ప్రాతినిథ్యం వహించే చోట జాతీయగీతాన్ని పాడితే బాగుంటుందని... థియేటర్లలో పాడాలని చెప్పడం అర్థంపర్థం లేని పని అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నిర్ణయాన్ని మరోసారి పున:సమీక్షిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. మరోవైపు, అరవింద్ స్వామి వ్యాఖ్యల పట్ల పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. 'రోజా'లాంటి దేశభక్తి చిత్రంలో నటించిన అరవింద్ స్వామి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటని... ఆయనకు దేశభక్తి లేదని ఆరోపిస్తున్నారు. 

More Telugu News