: దిల్‌సుఖ్ న‌గ‌ర్ బాంబు పేలుళ్ల కేసులో తీర్పు వెల్లడి.. ముజాహిదీన్ ఉగ్ర‌వాదులు దోషులుగా నిర్ధారణ.. 19న శిక్షల ఖరారు!

దిల్‌సుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్ల కేసులో ఈ రోజు తుది తీర్పు వెలువడింది. ఈ కేసులో ఇండియన్ ముజాహిదీన్ సంస్థ‌పై నేరం నిర్ధార‌ణ అయిన‌ట్లు కోర్టు ప్ర‌క‌టించింది. మొత్తం ఐదుగురు నిందితుల‌పై నేరం రుజువయిన‌ట్లు కోర్టు తెలిపింది. ఈ నెల 19న దోషుల‌కు శిక్ష‌ను ఖ‌రారు చేయ‌నున్న‌ట్లు తెలిపింది. మూడున్న‌రేళ్ల పాటు విచార‌ణ జ‌రిపిన ఎన్ఐఏ ఈ కేసుకు సంబంధించి అన్ని ఆధారాల‌ను కోర్టు ముందు ఉంచింది. ఇండియ‌న్ ముజాహిదీన్ ఉగ్ర‌వాదులు యాసిన్ భత్కల్ తోపాటు మరో నలుగురు నిందితులను దోషులుగా పేర్కొంది. ఎన్ఐఏ మొత్తం 5,244 మందిని సాక్షులుగా పేర్కొన్న విష‌యం తెలిసిందే. హైదరాబాద్ లోని దిల్ సుక్ నగర్  ఎక్స్ రోడ్డుతో పాటు కోణార్క్ థియేటర్ ఎదురుగా ఉండే ఆనంద్ టిఫిన్ సెంటర్ వద్ద  ఫిబ్రవరీ 21, 2013లో ఈ బాంబు పేలుళ్లు జరిగాయి.



 

More Telugu News