: విడాకులకు సిద్ధమైన మరో టాప్ హీరోయిన్

సినీ రంగంలోని ప్రముఖుల పెళ్లిళ్లు పెటాకులు అవుతున్న ఘటనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. బాలీవుడ్ నుంచి దక్షిణాది సినీ ప్రముఖుల వరకు ఇదే జరుగుతోంది. తాజాగా దక్షిణాదిలో ఓ వెలుగు వెలిగిన అందాల భామ మీరా జాస్మిన్ వైవాహిక బంధం కూడా తెగిపోవడానికి రెడీగా ఉంది. తెలుగులో కంటే తమిళ, మలయాళం సినిమాల్లో ఎక్కువ పేరు తెచ్చుకున్న మీరా జాస్మిన్... తన కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే రాజేష్ అనే మ్యుజీషియన్ తో ప్రేమాయణం సాగించింది. అప్పట్లో ఇది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. అయితే, ఆ ప్రేమాయణం ఎక్కువ కాలం కొనసాగలేదు. ఆ తర్వాత అనిల్ జాన్ వ్యాపారవేత్తతో అఫైర్ స్టార్ట్ చేసింది. అయితే, అప్పటికే అనిల్ కు పెళ్లయింది. మీరా జాస్మిన్ కోసం తన భార్యకు విడాకులిచ్చాడు అనిల్. ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లికి సిద్ధమవుతున్న సందర్భంలో... మీరాపై అనిల్ భార్య తరపు బంధువులు దాడి చేశారు. అనంతరం, పోలీసుల రక్షణలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

రెండేళ్ల వీరి పెళ్లి బంధానికి అప్పుడే బీటలు వారాయి.  విడిపోవాలని వీరిద్దరూ నిర్ణయించుకున్నట్లు సమాచారం. గత ఏడాది కాలం నుంచే తన భర్తకు దూరంగా మీరా ఉంటోందట. విడాకుల కోసం వీరు త్వరలోనే కోర్టు మెట్లు ఎక్కనున్నట్టు తెలుస్తోంది. విడాకులు తీసుకున్న తర్వాత... సినిమాల్లో మళ్లీ బిజీ కావాలని మీరా భావిస్తోందట. 

More Telugu News