: ఏడుగురు దళారుల అరెస్ట్.. రూ.93 లక్షల కొత్త నోట్లు స్వాధీనం

పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో అక్రమ లావాదేవీలపై నిఘా పెట్టిన అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలో భారీ మొత్తంలో న‌గ‌దు ప‌ట్టుబ‌డుతోంది. బ్యాంక‌ర్లు నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా క‌మీష‌న్ తీసుకొని న‌ల్ల‌కుబేరుల‌కు స‌హ‌క‌రిస్తుండ‌డంతో పెద్ద ఎత్తున కొత్త నోట్లు అక్ర‌మార్కుల చేతిలో ప‌డుతున్నాయి. బెంగళూరులోఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు తాజాగా రూ.93 లక్షల కొత్త కరెన్సీని  స్వాధీనం చేసుకున్నారు. న‌ల్ల‌కుబేరుల నుంచి పాత నోట్లు తీసుకొని వాటిని మార్చి కొత్త నోట్లు ఇస్తోన్న ఏడుగురు దళారులను అదుపులోకి తీసుకున్నామ‌ని  వారి నుంచే ఈ నగదును స్వాధీనం చేసుకున్నామ‌ని చెప్పారు. ఈ నోట్ల మార్పిడిలో పలు బ్యాంకు అధికారుల పాత్రపై  ఆరా తీస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

More Telugu News