: ఐటీ దాడులను సీసీ కెమెరాల సాయంతో సెల్ ఫోన్లో చూసి... అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయిన ఢిల్లీ లాయర్!

ఆయన ఇంట్లో ఎప్పుడు దాడులు జరిపినా కోట్లాది రూపాయలే దొరుకుతాయి. మళ్లీమళ్లీ దాడి చేసినా... మళ్లీమళ్లీ కోట్లే దొరుకుతాయి. ఆయనే లాయర్ రోహిత్ టాండన్. దక్షిణ ఢిల్లీలో ఉంటారు. అక్టోబర్ 7వ తేదీన ఆయన ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు జరిపినప్పుడు రూ. 125 కోట్లు పట్టుబడ్డాయి. ఆ తర్వాత రెండు వారాల అనంతరం మరోసారి సోదాలు జరిపితే రూ. 19 కోట్లు పట్టుబడ్డాయి. ఇప్పుడు తాజాగా మరోసారి దాడులు జరిపితే రూ. 14 కోట్లు దొరికాయి. ఈ డబ్బును తరలించడానికి ఐటీ అధికారులకు మూడు పెద్ద కార్లు (రెండు ఇన్నోవాలు, ఒక హోండా) కావాల్సి వచ్చింది .

ఐటీ అధికారులు తన ఇంట్లో సోదాలు జరుపుతున్న సమయంలో టాండన్ ఇంట్లో లేరు. కానీ తన ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాల ద్వారా... ఇంట్లో ఏమి జరుగుతుందో తన మొబైల్ ఫోన్ లో వీక్షించారు టాండన్. వెంటనే, అటునుంచి అటే అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు ఈయనను పట్టుకోవడానికి పోలీసులు గాలింపు జరుపుతున్నారు.

More Telugu News