: దిల్‌సుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్లలో తుదితీర్పు నేడే!

దిల్‌సుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్ల కేసులో నేడు తుది తీర్పు వెలువడనుంది. ఈ కేసులో ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ సహా మరో నలుగురు నిందితులు చర్లపల్లి జైలులో విచారణ ఖైదీలుగా ఉన్నారు. కేసును విచారించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మొత్తం 5244 మందిని సాక్షులుగా పేర్కొంది. వీరిలో 156 మంది సాక్షుల వాంగ్మూలాన్ని రంగారెడ్డి జిల్లా ప్రత్యేక సెషన్స్ కోర్టు నమోదు చేసింది. ఈ కేసులో ఇరు  పక్షాల వాదనలు గత నెల 7వ తేదీన ముగిశాయి. నేడు తుది తీర్పు వెలువడనున్న నేపథ్యంలో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.

More Telugu News