: ప్లేటో ప్రస్తావించిన అట్లాంటిస్ మహానగరం అంటార్కిటికాలో మంచు కింద ఉందా?

క్రీస్తు పూర్వం 360వ సంవత్సరంలో అట్లాంటిస్ మహానగరం గురించి గ్రీకు తత్వవేత్త ప్లేటో ప్రస్తావించారు. కానీ ఆ నగరం ఎక్కడ ఉందనేది ఎవరికీ తెలియదు. అయితే తాజాగా శాస్త్రవేత్తలు చేసిన ఒక ప్రకటన ఆ నగరంపై ఆసక్తి రేపుతోంది. అంటార్కిటికాలోని మంచు కింద ఓ రహస్య నగరం ఉందని కొంత మంది పరిశోధకులు ప్రతిపాదిస్తున్నారు. ఈ మేరకు ఒక థియరీని చెబుతున్నారు. ఐస్ ఏజ్ కు ముందు అంటార్కిటికాలో అంటే సుమారు 12 వేల సంవత్సరాల క్రితం అంటార్కిటికాలో మంచు లేదని గుర్తుచేస్తున్నారు. ఆ సమయంలో అంటార్కిటికాలో మానవ సమాజం సాధారణ జీవనం గడిపిందని, పట్టణాలు, కట్టడాలు ఉండేవని వారు చెబుతున్నారు.

తాజాగా నాసా తీసిన అంటార్కిటికా చిత్రాల్లో మంచు కింద మానవకట్టడాలు కనిపించాయని వారు చెబుతున్నారు. ఈ నిర్మాణాలు ప్రాచీన మహానగరం అట్లాంటిస్‌ వేనని వారు స్పష్టం చేస్తున్నారు. అంతే కాకుండా క్రీస్తుశకం 1513లో కొందరు సైనికాధికారులు రూపొందించిన ‘పిరి రియిస్‌’ అనే ప్రాచీన పటంలో కూడా ఈ నగరం ప్రస్తావన ఉండడంతో అంటార్కిటికాలో మంచుకింద కప్పబడిన మహానగరం అట్లాంటిస్సేనని, దీనిని అన్వేషించేందుకు జర్మన్‌ నియంత హిట్లర్‌ పరిశోధక బృందాన్ని అంటార్కిటిక్‌ కు పంపాడని, వారంతా ఆ నగరం అన్వేషణలో గల్లంతయ్యారంటూ ఒక కథనం ప్రచారంలో ఉండడం కూడా ఈ వాదనకు బలాన్నిస్తోంది. 

More Telugu News