: నగ్రోటాలోని ఆర్మీ క్యాంపులోకి ఉగ్రవాదులు ఎలా చొరబడ్డారంటే..!

జమ్మూ కశ్మీర్‌ లోని నగ్రోటాలోగల ఆర్మీ యూనిట్‌ పై ఉగ్రవాదులు దాడికి పాల్పడడంతో ఒక జవాన్ మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డ సంగతి తెలిసిందే. అయితే ఉగ్రవాదులు అంత సులభంగా ఆర్మీ యూనిట్ ఎమ్ఈఎస్ లోకి ఎలా ప్రవేశించగలిగారన్న దానిపై అధికారులు దర్యాప్తు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. ఆర్మీ యూనిట్ పై దాడి నిర్వహించేందుకు ఉగ్రవాదులు చాలా పకడ్బందీ ప్రణాళికతో వచ్చారని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సైలెన్సర్‌ గన్‌ తో రావడం విశేషం. వెనుకనున్న ఎలిఫెంట్ గ్రాస్ ద్వారా వెనుక మార్గం చేరుకున్న ఉగ్రవాదులు ఈ గన్ ఉపయోగించి తొలుత సెంట్రీని కాల్చి చంపారు. దీనిని ఒకరు గుర్తించగానే ఒక్కసారిగా గ్రెనేడ్‌ లు, కాల్పులతో విరుచుకుపడ్డారు. దీంతో భద్రతా సిబ్బంది వెంటనే ఎదురుకాల్పులు ప్రారంభించారు. దీంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆయుధగారాన్ని, ఆర్మీ కుటుంబాలను లక్ష్యం చేసుకుని ఉగ్రవాదులు విరుచుకుపడే ప్రయత్నం చేయడం ఇదే తొలిసారని అధికారులు పేర్కొంటున్నారు.

More Telugu News