: శ్రీవారి ఆలయంలోకి నీళ్లు..ఫైరింజన్లతో తొలగిస్తున్న వైనం

తిరుమలలో కుండపోత వర్షం కారణంగా శ్రీవారి ఆలయంలోకి వర్షపు నీరు చేరింది. దీంతో, ఫైరింజన్ల సాయంతో వర్షపు నీటిని తొలగిస్తున్నారు. కాగా, తిరుమలలో పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. తిరుపతిలో కూడా భారీ వర్షం కారణంగా, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మాలాడి గుండం, కపిలతీర్థం జలపాతాలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.  వార్దా తుపాన్ నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది.  విజయవాడ-చెన్నై మార్గంలో ప్రయాణించే పలు రైళ్లను రేణిగుంట మీదుగా మళ్లించారు. ఇక నెల్లూరు-చెన్నై మధ్య రైళ్లను ఏకంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

More Telugu News