mahender reddy rtc: ఆర్టీసీలో 100 శాతం నగదు రహిత లావాదేవీలే లక్ష్యం!: తెలంగాణ రాష్ట్ర మంత్రి మహేందర్‌రెడ్డి

ఆర్టీసీలో 100 శాతం న‌గ‌దు ర‌హిత లావాదేవీలే జ‌రిగేలా ప్రోత్స‌హించాల‌ని తాము ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్లు తెలంగాణ ర‌వాణాశాఖ మంత్రి మ‌హేంద‌ర్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఈ రోజు నగదు రహిత లావాదేవీలపై  మ‌హేంద‌ర్‌రెడ్డి అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ..  న‌గ‌దు కొర‌త దృష్ట్యా ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని చెప్పారు. ప్రస్తుతం ఆర్టీసీలో 90 శాతం నగదు చెల్లింపులే జ‌రుగుతున్నాయ‌ని ఆయ‌న అన్నారు. రాష్ట్రంలో రవాణాశాఖలో ఆన్‌లైన్‌ చెల్లింపు పద్ధతి ప్రవేశపెట్టినప్ప‌టి నుంచి ఇప్పటివరకు రూ.11 కోట్ల లావాదేవీలు ఆన్‌లైన్ ద్వారానే జ‌రిగాయ‌ని ఆయ‌న అన్నారు.

More Telugu News