పాములు: ఈ పాము కరిస్తే రెండు గంటలకు మించి బతకడం అసాధ్యం!

తమిళనాడులోని రామనాథపురం జిల్లా సాయల్ కుడి సమీపంలోని మన్నార్ వలైకుడ దీవుల్లో కొత్తరకం రక్తపింజరి పాములు ఉన్నాయని, అవి కరిస్తే రెండు గంటలకు మించి బతకడం అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. ఇవి నల్ల రంగులో ఉంటాయని, వీటి తల భాగం డైమండ్ ఆకారంలో ఉంటుందని, ఇవి కేవలం అడుగు పొడుగు మాత్రమే ఉంటాయని, పొదల్లో దాక్కుని ఒక్కసారిగా దాడి చేస్తాయని అటవీ శాఖాధికారులు తెలిపారు.

 మన్నార్‌ వలైకుడ జాతీయ సముద్రజీవుల నివాసమైన పులుగుసల్లి దీవి 6.12 హెక్టార్లు, ఉప్పునీటి దీవి 29.64 హెక్టార్లు, మంచినీటి దీవి రూ.110 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. ఈ మూడు దీవుల్లో కనిపించే ఈ అరుదైన రక్తపింజరి రకానికి చెందిన సర్పాలు భారీ ఎత్తున నివసిస్తున్నాయి. జనసంచారం లేని ఈ దీవుల్లో ఈ అరుదైన రకానికి చెందిన రక్తపింజరి జాతి సర్పాలను అక్రమంగా తరలించకుండా ఉండేందుకు కాపలాదారులను కూడా అటవీశాఖాధికారులు నియమించారు. ఇక్కడ నివాసం ఉండేందుకు జాలర్లకు కూడా అనుమతిలేదు. 

More Telugu News