: గెలవలేక టీమిండియాపై అక్కసు వెళ్లగక్కుతున్న ఇంగ్లండ్ ప్లేయర్లు

ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీన్ ను ఇండియా కైవసం చేసుకుంది. ముంబైలో జరిగిన నాలుగో టెస్టులో ఇన్నింగ్స్ 36 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ను టీమిండియా చిత్తు చేసింది. దీంతో, భారత్ గెలుపును తక్కువ చేసి చూపేందుకు ఇంగ్లీష్ ప్లేయర్లు యత్నిస్తున్నారు. భారత్ గెలుపుకు ఇక్కడున్న స్లో పిచ్ లే కారణమని ఇంగ్లండ్ పేస్ బౌలర్ అండర్సన్ ఆరోపించాడు. పేస్ కు అనుకూలించని పిచ్ ల వల్లే తాము ఘోరంగా ఓడిపోయామని చెప్పాడు. పిచ్ లలో సాంకేతికంగా పాటించాల్సిన కొన్ని పద్దతులను పాటించలేదని అన్నాడు. ఇతంతా విరాట్ కోహ్లీ గేమ్ ప్లాన్ లో భాగంగానే జరిగిందంటూ అసహనం వ్యక్తం చేశాడు. 2014లో భారత్ ఇంగ్లండ్ లో పర్యటించినప్పుడు కోహ్లీ చాలా ఇబ్బంది పడ్డాడని... అప్పటికీ, ఇప్పటికీ కోహ్లీ బ్యాటింగ్ లో మార్పు వచ్చి ఉంటుందని తాను భావిచడం లేదని తెలిపాడు. స్పిన్ బాగా ఆడగలిగే కోహ్లీ... ఇక్కడ అలాంటి పిచ్ లనే తయారు చేయించుకున్నాడని భావిస్తున్నట్టు చెప్పాడు.

More Telugu News