: శ్రీహరికోట సమీపంలో నడి సముద్రంలో... ప్రాణాపాయంలో తమిళ జాలర్లు... కాపాడడానికి అధికారుల ప్రయత్నాలు!

నెల్లూరు జిల్లా శ్రీహరికోట సమీపంలో తమిళ జాలర్లు సముద్రంలో చిక్కుకుపోయారు. రెండు రోజుల క్రితం 18 మంది జాలర్లు చేపల వేటకోసం సముద్రంలోకి వెళ్లారు. వార్దా తుపాను ప్రభావంతో, సముద్రం అల్లకల్లోలంగా మారడంతో, వారు ప్రాణాపాయ స్థితిలోకి జారుకున్నారు. అయితే, షార్ భద్రతా సిబ్బంది వారిని కాపాడే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే 8 మంది జాలర్లను శ్రీహరికోటకు తరలించారు. మిగిలిన వారిని కూడా కాపాడేందుకు భద్రతా సిబ్బంది సహాయక చర్యలను కొనసాగిస్తోంది. జిల్లా ప్రత్యేక ఐఏఎస్ అధికారి శ్రీధర్, జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్, ఇతర అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 

More Telugu News