: చైనాతో కలసి పనిచేయాల్సిన అవసరం ఏముంది?: ట్రంప్ కీలక వ్యాఖ్యలు

చైనాపై అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాలకు ఏమాత్రం సాయపడని చైనాతో మనం కలిసి పనిచేయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. ఇతర దేశాలను పట్టించుకోకుండా చైనా ఎప్పటికప్పుడు తన కరెన్సీని డీవాల్యుయేషన్ చేస్తోందని మండిపడ్డారు. మనం చైనాకి పన్ను మినహాయింపులు ఇచ్చినా... చైనా మాత్రం భారీగా పన్నులు విధిస్తోందని విమర్శించారు.

'వన్ చైనా' పాలసీ పేరుతో తైవాన్ పట్ల చైనా నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని అన్నారు. తైవాన్ పై చైనా అనుసరిస్తున్న విధానాన్ని 1979 నుంచి అమెరికా గౌరవిస్తోంది. కానీ, ట్రంప్ మాత్రం చైనా పాలసీని వ్యతిరేకిస్తున్నారు. ఉత్తర కొరియాతో చైనాకు మంచి సంబంధాలు ఉన్నప్పటికీ... ఆ దేశ అధ్యక్షుడి నియంతృత్వ పోకడలను మాత్రం కట్టడి చేయలేకపోతోందని విమర్శించారు. అమెరికాను నియంత్రించే విధంగా చైనా వ్యవహరిస్తుండటం తమకు ఏమాత్రం ఇష్టం లేదని స్ఫష్టం చేశారు.

More Telugu News