: ప్రథమ పౌరుడు ప్రణబ్ ముఖర్జీకి ప్రధాని శుభాకాంక్షలు

దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 81వ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ ప్రయోజనాలే అన్నింటికంటే ప్రథమంగా భావించే వ్యక్తి, విద్యావేత్త, మేధావి అయిన రాష్ట్రపతిని కలిగి ఉన్నందుకు ఈ దేశం గర్విస్తోందంటూ ప్రధాని ట్వీట్ చేశారు. ‘‘ప్రణబ్ అద్భుతమైన అనుభవం, జ్ఞానం వల్ల దేశానికి ఎంతో ప్రయోజనం చేకూరింది. దీర్ఘకాలం పాటు ఆయన ఆరోగ్యంగా జీవించాలని ప్రార్థిస్తున్నాను’’ అంటూ మోదీ తన ట్వీట్ లో పేర్కొన్నారు. దేశ 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ 2012 జూలై 25న ప్రతిభా పాటిల్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవీ కాలం వచ్చే ఏడాది జూలైలో ముగిసిపోనుంది. హిస్టరీ, పొలిటికల్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ తోపాటు, లా డిగ్రీ కూడా ప్రణబ్ కలిగి ఉన్నారు. 2008లో పద్మభూషణ్ అవార్డును అందుకున్న ఆయన ఐదు పర్యాయాలు రాజ్యసభకు, రెండు పర్యాయాలు లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు. ఆర్థిక శాఖతోపాటు ఎన్నో కీలక శాఖలకు మంత్రిగా సేవలు అందించారు.

More Telugu News