: వేములవాడ ఎమ్మెల్యేకు బెదిరింపులు

వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబుకు ఆగంతుకుల నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. రమేశ్ బాబు ఇంటిని పేల్చేస్తామంటూ ఇంటర్నెట్ ద్వారా కాల్ చేసిన ఆగంతుకులు బెదిరించినట్టు సమాచారం. ఎమ్మెల్యే ఇచ్చిన సమాచారంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై వేములవాడలోని రమేశ్ బాబుకు చెందిన సంగీత నిలయంలో తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి బాంబు లేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించలేదు. వీఐపీల పర్యటన నేపథ్యంలో తనిఖీలు నిర్వహించినట్టుగా చెప్పారు.

More Telugu News