: పేరుమోసిన కంపెనీకి చైర్మన్.. చేసింది భారీ దొంగతనం!

భారతీయ రైల్వేలకు బోగీలను, ఇతర సామగ్రిని తయారుచేసి సరఫరా చేసే కంపెనీకి ఆయన చైర్మన్. అయితే మాత్రం ఏంటి? తన వక్రబుద్ధితో దొంగగా మారాడు. రైల్వేలకు చెందిన రూ.50 కోట్ల విలువైన సామగ్రిని మాయం చేశాడు. తప్పించుకునేందుకు ఎన్నో పాట్లు పడ్డాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. కోల్‌కతాలోని పేరుమోసిన కంపెనీ రుయా గ్రూప్‌కు పవన్ రుయా చైర్మన్. దశాబ్దాలుగా ఈ కంపెనీ రైల్వేలకు బోగీలతోపాటు ఇతర సామగ్రిని తయారుచేస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా ఇటీవల పవన్ బుద్ధి వక్రమార్గం పట్టింది. కోల్‌కతాలోని తన జెస్సాప్ ఫ్యాక్టరీలోని రూ.50 కోట్ల విలువైన సామగ్రిని పవన్ మాయం చేశాడు. దీంతో రైల్వే శాఖ పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు అక్టోబరు 17న సొంత ఫ్యాక్టరీనే తగలబెట్టించిన ఘనుడు పవన్. అంతేకాదు విచారణ నుంచి తప్పించుకునేందుకు పలుమార్లు హైకోర్టును ఆశ్రయించాడు. చివరికి ఢిల్లీలోని ఆయన నివాసంలో సీఐడీకి చిక్కాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News