: డెబిట్ లేదా క్రిడిట్ కార్డు ఉంటేనే 'మందు' బాటిల్.. వరంగల్ లో ప్రయోగాత్మకంగా మద్యం అమ్మకాలు
ఈ నెల 20 నుంచి వరంగల్ లో ప్రయోగాత్మకంగా మద్యం అమ్మకాలు చేపట్టనున్నట్టు ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఆ రోజు నుంచి వరంగల్ లో మద్యం దుకాణాలలో ఎవరైనా మద్యాన్ని క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ద్వారా మాత్రమే కొనుగోలు చేయాలని తెలిపారు. ఈ మేరకు అన్ని షాపుల దగ్గర ఫ్లెక్సీలు, నోటీసులు ఏర్పాటు చేశారు. దీనిపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డెబిట్ లేదా క్రిడిట్ కార్డులు ఉన్నవారు వాటిని వాడుతారని, లేని వారి పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. 2000 రూపాయల నగదు తెచ్చినా చిల్లర లభించడం లేదని, వారు వాపోయారు. బలవంతంగా ఇలాంటి నిర్ణయాలు సరికాదని వారు సూచిస్తున్నారు.