: 'నాకు మద్దతు తెలపండి' అంటూ సైరస్ మిస్త్రీ షేర్ హోల్డర్స్ కు లేఖ

ప్రముఖ పారిశ్రామిక వేత్త, మాజీ టాటా గ్రూప్ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ టాటా పవర్ షేర్ హోల్డర్స్ కు లేఖ రాశారు. ఈ లేఖలో తనకు మద్దతు తెలపాలని షేర్ హోల్డర్స్ ను కోరారు. తాను ఛైర్మన్ గా ఉన్న కాలంలో టాటా పవర్ ప్రత్యర్థుల కంటే మెరుగైన స్థానంలో నిలిచిందని ఆయన గుర్తు చేశారు. గత మూడేళ్లో ఈబీఐటీడీఏలు మెరుగుపడ్డాయని ఆయన తెలిపారు. దేశీయ పవర్ సెక్టార్ లో కంపెనీకి పునఃరేటింగ్ కల్పించానని ఆయన లేఖలో పేర్కొన్నారు. కాగా, 2006లో టాటా సన్స్ బోర్డులో చేరిన మిస్త్రీ, 2012లో బోర్డు ఛైర్మన్ గా ఎంపికయ్యారు. ఛైర్మన్ పదవి నుంచి తొలగించడానికి తోడు, ఈ నెల 26న నిర్వహించనున్న జనరల్ మీటింగ్ ద్వారా బోర్డు నుంచి పూర్తిగా తప్పుకోవాలని మిస్త్రీని టాటా కోరే అవకాశముంది. దీంతో సైరస్ మిస్త్రీ తనకు మద్దతు తెలపాలని షేర్ హోల్డర్స్ ను కోరారు. అయితే వారు రతన్ టాటాను కాదని, మిస్త్రీకి మద్దతుగా నిలిచే అవకాశం ఉందా? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.

More Telugu News