: ఈ దేశాల్లో సగం సంపాదన తిండికే ఖర్చయిపోతోంది!

ప్రపంచ వ్యాప్తంగా తిండి కోసం అత్యంత ఎక్కువ ఖర్చు చేస్తున్న దేశాల జాబితాలో నైజీరియా అగ్రస్థానాన్ని ఆక్రమించింది. నైజీరియన్లు తిండి కోసం తమ సంపాదనలో సగం కంటే ఎక్కువ శాతం ఆదాయాన్ని ఖర్చుచేస్తున్నారు. వీరు తమ సంపాదనలో సుమారు 56.4 శాతాన్ని తిండి కోసం ఖర్చు చేస్తున్నారు. తరువాతి స్థానంలో కెన్యా నిలుస్తోంది. కెన్యన్లు తమ ఆదాయంలో 46.7 శాతం తిండి కోసం ఖర్చు చేస్తూ ద్వితీయ స్థానంలో నిలిచారు. మూడో స్థానంలో కామెరూన్ 45.6 శాతంతో నిలిచింది. దాని తరువాతి స్థానంలో 42.5 శాతంతో అల్జీరియా, ఆ తరువాతి స్థానంలో 43 శాతంతో కజకిస్థాన్, తరువాతి స్థానంలో 41.9 శాతంతో ఫిలిప్పీన్స్ వుండగా, ఏడో స్థానంలో పాకిస్థాన్ 40.9 శాతం ఖర్చుతో నిలిచింది. ఎనిమిదో స్థానంలో 40.6 శాతం ఖర్చుతో గ్వాంటిమలా నిలవగా, ఈ జాబితాలో 9వ దేశంగా అజర్ బైజాన్ 40.1 శాతంతో నిలిచింది. ఆదాయం పెరగకపోవడానికి తోడు వ్యయం పెరిగిపోవడంతో వీరు సంపాదనలో అత్యధికం తిండికోసం ఖర్చు చేయాల్సి వస్తోంది. ఏటా ఒక అమెరికన్ 2,392 (1,61,424 రూపాయలు) డాలర్లు ఖర్చు చేస్తుండగా, ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన నైజీరియన్ 1,132 (76,393 రూపాయలు) డాలర్లు ఖర్చుచేస్తుండగా, కెన్యన్ ఏడాది తిండికి కేవలం 543 (36,644 రూపాయలు) డాలర్లు మాత్రమే ఖర్చు చేస్తుండడం విశేషం.

More Telugu News