: శశికళ గురించి అంతా తెలిసినా... జయ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు?

తనకు తెలియకుండా శశికళ చేస్తున్న కుట్రలు జయలలితకు మొత్తం తెలుసు. ఈ వ్యవహారాన్ని తెహల్కా రిపోర్టర్ జీమన్ జాకబ్ 2012లో బయటపెట్టారు. శశికళ కుట్రల గురించి జయకు తెలిసినా... ఆమెపై చర్యలను ఎందుకు తీసుకోలేదో జీమన్ వివరించారు. శశికళ, ఆమె భర్త నటరాజన్, రావణన్ (శశికళ పినతండ్రి అల్లుడు) సహా 'మన్నార్ గుడి మాఫియా'లోని మరో నలుగురు వ్యక్తులు బెంగళూరులో రహస్యంగా భేటీ అయ్యారు. అక్రమాస్తుల కేసులో జయకు ఎదురయ్యే సమస్యలు, ముఖ్యమంత్రి పీఠంపై ఎవరిని కూర్చోబెట్టాలి? అనే విషయాలపై వీరు చర్చించారు. ఈ వ్యవహారం నాటి డీజీపీ రామానుజం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో, అప్పటి కర్ణాటక డీజీపీ టేపులతో సహా సమాచారాన్ని రామానుజంకు అందజేశారు. ఈ టేపులను మొత్తం విన్న జయలలిత... వెంటనే ఎలాంటి చర్యలు తీసుకోకుండా, కొన్ని రోజులు సైలెంట్ గానే ఉన్నారు. ఇదే సమయంలో డీజీపీ రామానుజం వీరికి సంబంధించిన మరిన్ని పక్కా ఆధారాలను సంపాదించారు. అంతేకాదు, మన్నార్ గుడి మాఫియాపై పూర్తి నిఘా వేశారు. దీనికి తోడు ఓ డిటెక్టివ్ ఏజన్సీకి బాధ్యతలు అప్పగించారు. ఆ సమయంలో శశికళ కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఫోన్ సంభాషణలను ఎప్పటికప్పుడు జయకు చేరవేశారు. అయితే, వీరిపై వెంటనే చర్యలు తీసుకుంటే పార్టీపైనా, ప్రభుత్వంపైనా ప్రభావం పడుతుందని జయ భావించారు. ఇదే సమయంలో, శశికళకు సన్నిహితంగా ఉన్న అధికారులను జయ పక్కకు తొలగించారు. పదేళ్లుగా తనకు వ్యక్తిగత భద్రతాధికారిగా ఉన్న తిరుమలైస్వామిని కూడా సాగనంపారు. ఇదే సమయంలో, తన మంత్రివర్గాన్ని కూడా అప్రమత్తం చేశారు. ఆ తర్వాత శశికళతో పాటు ఆమె కుటుంబసభ్యులను దూరం పెట్టేశారు. కానీ, మళ్లీ మచ్చిక చేసుకుని జయ చెంతకు చేరారు శశికళ.

More Telugu News