: ఫ్యాషన్ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీని అభినందించిన సమంత
ప్రముఖ సినీ నటి సమంత ఫ్యాషన్ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీని అభినందించింది. ప్రముఖ నటుడు నాగార్జున కుమారుడు యువనటుడు అఖిల్ నిశ్చితార్థం హైదరాబాదులో నిన్న రాత్రి ఘనంగా జరిగింది. ప్రముఖ పారిశ్రామికవేత్త జీవీకే మనవరాలు ఫ్యాషన్ డిజైనర్ శ్రేయ భూపాల్ తో ప్రేమలో పడ్డ అఖిల్ అక్కినేనికి అత్యంత సన్నిహితుల మధ్య ఘనంగా నిశ్చితార్థం నిర్వహించారు. ఈ వేడుకలో నాగార్జున పెద్ద కుమారుడు, నటుడు నాగచైతన్య, సమంత జంట సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచారు. సంప్రదాయ చీరకట్టులో సమంత పెద్దరికం ఒలకబోసేలా ఈ వేడుకలో కనిపించారు. సహజంగా నీరజ కోన డిజైన్ చేసే దుస్తులు ధరించే సమంత ఈ వేడుకకోసం ప్రముఖ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ తయారు చేసిన చీరను ధరించారు. ఇది ఆమెకు మరింత అందాన్నిచ్చింది. దీంతో ఆయనను కొనియాడుతూ, 'సవ్యసాచి ముఖర్జీ మంచి దుస్తులు డిజైన్ చేయడంలో ఎప్పుడూ తప్పు చేయరు' అంటూ పేర్కొంది.