: జయకు స్లో పాయిజన్ ఎక్కించిన శశికళ... 2012లోనే తెహల్కా సంచలన కథనం

జయలలిత మరణం తర్వాత ఆమె మృతిపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఏదో జరిగింది అంటూ పలువురు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. సినీ నటి గౌతమి అయితే తన అనుమానాలను వ్యక్తీకరిస్తూ ప్రధాని మోదీకి ఏకంగా లేఖనే సంధించారు. 2012లో ప్రముఖ పత్రిక తెహల్కా శశికళ గురించి సంచలన కథనాన్ని ప్రచురించింది. మన్నార్ గుడి మాఫియాను ఏర్పాటు చేసుకున్న శశికళ అనేక అక్రమాలకు పాల్పడ్డారని కథనంలో ఆరోపించింది. అంతేకాదు, జయలలితను చంపేందుకు కూడా కుట్ర చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పోయస్ గార్డెన్ నుంచి తనను జయ వెళ్లగొట్టిన తర్వాత... తాను నియమించిన నర్సు ద్వారా జయకు శశికళ స్లో పాయిజన్ ఎక్కించారని పేర్కొంది. తాను వాడుతున్న మందులపై జయ చేయించుకున్న వ్యక్తిగత వైద్య పరీక్షల్లో కూడా ఈ విషయం వెల్లడి అయిందని తెహల్కా తెలిపింది. శశికళను సీఎంను చేయడానికి మన్నార్ గుడి మాఫియా ఎన్నో ప్రయత్నాలను చేసిందని ఆరోపించింది. అక్రమాలకు పాల్పడిన శశికళను, ఆమె బంధువులను పోయస్ గార్డెన్ నుంచి జయ వెళ్లగొట్టిన తర్వాత... జయను మళ్లీ మచ్చిక చేసుకుని, ఆమె వద్దకు చేరిన శశికళ... ఆ తర్వాత పోయస్ గార్డెన్ నుంచే ఆమెపై కుట్రలు సాగించిందని తెహల్కా తెలిపింది. 2012లో తెహల్కా రాసిన ఈ కథనం... ఇప్పుడు మళ్లీ వెలుగులోకి వచ్చి, సంచలనం రేపుతోంది.

More Telugu News