: జయ మరణం విషయంలో మోదీకి రాసిన లేఖలో గౌతమి సంధించిన ప్రశ్నలు!

దివంగత ముఖ్యమంత్రి, పురచ్చితలైవి 75 రోజుల పాటు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అయితే, ఆమె మరణం పట్ల పలువురికి పలు అనుమానాలు ఉన్నాయి. సినీ నటి గౌతమి అయితే, తన అనుమానాలను వ్యక్తీకరిస్తూ ఏకంగా ప్రధాని మోదీకి లేఖ రాశారు. అమ్మ మరణం పట్ల తనకు చాలా అనుమానాలు ఉన్నాయని లేఖలో ఆమె స్పష్ట చేశారు. మోదీకి గౌతమి సంధించిన ప్రశ్నలివే... 1. ఆసుపత్రిలో జయలలిత చేరిక, చికిత్స, రికవరీ, మరణం... ఇవన్నీ కూడా ఇంత సడన్ గా ఎలా జరిగాయి? 2. హాస్పిటల్ లో జయ చికిత్స పొందుతున్నప్పుడు... ఆమెను పరామర్శించడానికి ఎవర్నీ కూడా ఎందుకు అనుమతించలేదు? 3. జయలలితను కలవకుండా ఆదేశించింది ఎవరు? 4. చికిత్సకు సంబంధించిన నిర్ణయాలను ఎవరు తీసుకున్నారు? 5. అమ్మ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఎందుకు స్పష్టత ఇవ్వలేదు? 6. జయలలిత మరణం పట్ల ప్రజల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలను తీర్చేదెవరు?

More Telugu News