: భారత సాయం కోరిన మంగోలియా... అంత పిచ్చి దేనికంటూ హెచ్చరించిన చైనా!

ఇండియాను ఆర్థిక సహాయం కోరిన మంగోలియాపై చైనా మండిపడుతోంది. మంగోలియా ఇప్పుడు భారత్ స్నేహం కోసం ఎదురుచూస్తుండటం, ఓ పిచ్చి చర్యగా అభివర్ణిస్తూ, ఇండియాకు దగ్గరైతే, చైనాతో ద్వైపాక్షిక బంధం బలహీన పడుతుందని హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల భారత్ లో మంగోలియా రాయబారి గోన్చిగ్ గన్హోల్డ్ ఓ కార్యక్రమంలో పాల్గొని, ఇండియా తమకు ధన సహాయం చేయాలని కోరిన నేపథ్యంలో చైనా స్పందించింది. ఈ విషయంపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లూ కాంగ్ మాట్లాడుతూ, మంగోలియా కష్టాలు కొనితెచ్చుకుంటోందని చెప్పినట్టు 'గ్లోబల్ టైమ్స్' పత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. రష్యా, చైనాల మధ్య ఇరుక్కుని నలిగిపోతున్న మంగోలియా, మరో దేశం నుంచి సాయం పొందాలని చూస్తోందని, దీని వల్ల మంగోలియా తీవ్ర ప్రమాదంలో పడనుందని పేర్కొంది. రెండు పెద్ద దేశాల మధ్య ఉండి, మూడో దేశం నుంచి సాయం ఆశించడం మంగోలియా చేస్తున్న తప్పని పేర్కొంది.

More Telugu News