: ఒక్క రాత్రిలో అమ్ముడు పోయిన బంగారం 15 టన్నులు!

దేశంలో పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన నవంబర్ 8వ తేదీ రాత్రి ఇండియాలో 15 టన్నుల బంగారం విక్రయాలు జరిగాయని ఐబీజేఏ (ఆల్ ఇండియా జ్యూయెలర్స్ అసోసియేషన్) వెల్లడించింది. నెల మొత్తంలో అమ్ముడయ్యే బంగారంలో ఇది 20 శాతమని వారు తెలిపారు. మొత్తం రూ. 5 వేల కోట్ల విలువైన ఆభరణాలు, బంగారం బిస్కెట్ల అమ్మకాలు సాగాయని వివరించారు. ఇండియాలో ఆరు లక్షల మందికి పైగా బంగారం వ్యాపారులు ఉండగా, 1800 మంది నిబంధనలను ఉల్లంఘించి పాత నోట్లు తీసుకుని లావాదేవీలు జరిపారని, వీరిపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశామని వెల్లడించారు. నవంబర్ లో 11వ తేదీ వరకూ సాగిన అమ్మకాల వివరాలకు తెప్పించుకుని కేంద్ర ఎక్సైజ్ నిఘా విభాగం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

More Telugu News