: విపరీతంగా పెరిగిపోతున్న ఫేస్‌బుక్ యూజర్లు

సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ఫేస్‌బుక్ త‌న యాక్టివ్ యూజ‌ర్ల సంఖ్య‌ను రోజురోజుకీ పెంచుకుంటూ వెళుతోంది. ఫేస్‌బుక్‌ను ఓపెన్ చేయ‌క‌పోతే రోజులో ఏదో కోల్పోతున్న‌ట్లు భావిస్తున్నారా? అన్న‌ట్లు యూజ‌ర్లు అందులో యాక్టివ్‌గా క‌నిపిస్తున్నారు. భార‌త్‌లో ఫేస్‌బుక్ వాడ‌కం గురించి ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఫేస్‌బుక్‌కు నెలవారీ 16.6 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు భార‌త్‌లో ఉన్నారు. వారిలో కంప్యూట‌ర్‌ నుంచి ఫేస్‌బుక్‌ను ఉప‌యోగించే వారిక‌న్నా మొబైల్ నుంచి ఉప‌యోగించేవారి సంఖ్యే అధికం. ఏకంగా 15.9 కోట్ల మంది మొబైల్ ద్వారానే ఫేస్‌బుక్‌ను వినియోగిస్తున్నారు. ఇక‌ రోజువారీ యాక్టివ్ యూజర్లు 8.5 కోట్లుగా ఉన్నారు. అందులో మొబైల్‌లో ఎల్లప్పుడు యాక్టివ్‌గా ఉండేవారి శాత‌మే 8.1 కోట్లుగా ఉంది.

More Telugu News