: 15 రోజుల్లో నోట్ల సమస్యలన్నీ సర్దుకుంటాయి: సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది. నోట్ల రద్దుతో ప్రజల్లో అసహనం పెరిగిందంటూ కొన్ని రాజకీయ పార్టీలు కావాలనే ప్రచారం చేస్తున్నాయని విమర్శించింది. నోట్ల రద్దు తర్వాత తామేమీ ఖాళీగా కూర్చోలేదని... డబ్బును సరఫరా చేయడానికి అన్ని చర్యలనూ తీసుకున్నామని ...మరో పది, పదిహేను రోజుల్లో సమస్యలన్నీ సర్దుకుంటాయని చెప్పింది. నోట్ల రద్దు అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో కొందరు వేసిన పిటిషన్లు ఈ రోజు విచారణకు వచ్చాయి. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ రోహత్గీ వాదనలను వినిపిస్తూ, నోట్లను రద్దు చేయాలనే నిర్ణయం తీసుకునే సమయానికి కొత్త నోట్లను ముద్రించలేదని... అలా చేస్తే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం లీక్ అవుతుందనే నిర్ణయంతోనే ముద్రించలేదని చెప్పారు. సమాజంలో అసహనం నెలకొనలేదని... దేశం మొత్తంమీద ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కోర్టుకు తెలిపారు.

More Telugu News