: 2006లో ముంబైలో జరిగిన టెస్టులో కూడా 400 కొట్టారు... అప్పటి ఫలితమే ఇప్పుడు కూడా వస్తుందా?

ముంబైలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ జట్టు 400 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్ చేస్తోంది. సరిగ్గా పదేళ్ల క్రితం 2006లో ముంబైలో జరిగిన టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో కూడా ఇంగ్లండ్ 400 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ ఇన్నింగ్స్ లో ఒక ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్ సెంచరీ చేయగా... ఈ ఇన్నింగ్స్ లో కూడా ఒకరు సెంచరీ చేశారు. ఆనాటి మ్యాచ్ లో అప్పటి దాకా బ్యాటింగ్ కు అనుకూలించిన పిచ్ అనూహ్యంగా మారిపోయింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా 279 పరుగులకు ఆలౌట్ అయింది. ధోనీ 69 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో 191 పరుగులకే ఇంగ్లండ్ కుప్పకూలింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన భారత్ అత్యంత దారుణంగా కేవలం 100 పరుగులకే ఆలౌట్ అయింది. ఆల్ టైమ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ చేసిన 34 పరుగులే టాప్ స్కోర్. దీంతో, ఇండియాపై ఇంగ్లండ్ 212 పరుగులతో జయభేరి మోగించింది. 2006లో జరిగిన సీనే ఇప్పుడు కూడా రీపీట్ అవుతుందని చెప్పలేం కానీ... ఒకవేళ జరిగితే విచిత్రమే.

More Telugu News