: నోట్ల రద్దుతో మాయం కానున్న 4 లక్షల ఉద్యోగాలు

పెద్ద నోట్ల రద్దుతో వచ్చే సంవత్సరం దాదాపు 4 లక్షల ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఈ కామర్స్, రియలెస్టేట్ రంగాలలో ఎక్కువ ఉద్యోగాలు ఊడిపోనున్నాయి. ఈకామర్స్ రంగంలో ఎక్కువగా క్యాష్ ఆన్ డెలివరీ పద్ధతిలోనే కొనుగోళ్లు ఉంటాయి. జనాల దగ్గర క్యాష్ లేకపోవడంతో... చాలా మంది కొనుగోళ్లకు మొగ్గు చూపరు. ఈ నేపథ్యంలో, వ్యాపారం జరగనప్పుడు ప్రస్తుతం ఉన్నంత మంది ఉద్యోగులు అవసరం లేదని కంపెనీలు భావించి, ఉద్యోగులను తొలగిస్తాయి. ప్రస్తుతం ఈ కామర్స్ రంగంలో దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని అంచనా. వచ్చే ఏడాది ఈ రంగంలో 2 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. ఇదే విధంగా రియలెస్టేట్ రంగంలో మరో లక్ష మంది... చేనేత, వస్త్ర రంగం, తోలు పరిశ్రమ, తదితర రంగాల్లో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. మొత్తం మీద వచ్చే ఏడాది 4 లక్షల మంది ఉద్యోగాలను కోల్పోనున్నారని నిపుణులు చెబుతున్నారు.

More Telugu News