: ఉగ్రదాడికి ప్లాన్ చేసిన వారికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన ఆస్ట్రేలియా సుప్రీంకోర్టు

ఉగ్రదాడికి ప్లాన్ చేసిన ఇద్దరు యువకులకు ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ సుప్రీంకోర్టు కఠిన కారాగార శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే, 2015 ఫిబ్రవరిలో ఒమర్ అల్ కుతోబి (25), మహమ్మద్ కియాద్ (27)లు సిడ్నీలోని షియా ప్రార్థనా మందిరంపై దాడి చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే, అదే రోజున వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నివాసాల్లో సోదాలు జరిపితే... దాడుల కోసం సిద్ధం చేసుకున్న కత్తులు, ఐఎస్ఐఎస్ జెండాలు, వీడియోలు వెలుగు చూశాయి. ఈ వీడియోల్లో మనుషుల మెడ, కిడ్నీలపై ఎలా దాడి చేసి చంపాలో తెలిపే దృశ్యాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, న్యూ సౌత్ వేల్స్ సుప్రీంకోర్టు వీరిద్దరికీ 20 ఏళ్ల జైలు శిక్షను విధించింది.

More Telugu News