: పాక్ కు చివరి క్షణంలో ఆగిపోయిన అమెరికా ఆర్థిక సాయం!!

హక్కానీ నెట్ వర్క్ ను అంతం చేసేందుకు అమెరికా సెనేట్ ఆమోదించిన 6,121 కోట్ల రూపాయలు పాకిస్థాన్ కు చేరే సమయంలో.. అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ పెట్టిన మెలిక ఆ దేశాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ద్వైపాక్షిక సంబంధాల పేరుతో, చైనాను బూచిగా చూపి అమెరికాకి.. భారత్ ను బూచిగా చూపి చైైనాకి దగ్గరైన ఏకైక దేశం పాకిస్థాన్. తీవ్రవాదులను అణచివేస్తాం, హక్కానీ నెట్ వర్క్ ను అంతం చేస్తాం అంటూ లక్షల కోట్ల రూపాయల తాయిలాలు పొందింది. తాజాగా అమెరికా సెనేట్ 400 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించేందుకు ఆమోదించింది. దీనిపై ఒమా సంతకం చేస్తే డబ్బులు వచ్చేసినట్టే, అయితే ఇంతలో అమెరికా ఒక మెలిక పెట్టింది. హక్కానీ నెట్ వర్క్ ను అంతమొందించేందుకు సహాయం చేస్తూ, పాక్ లో పాతుకుపోతున్న తీవ్రవాదన్ని ఆ దేశం అంతమొందించినట్టు రక్షణ శాఖ నిర్ధారిస్తేనే ఈ డబ్బులు పాక్ కు చేరుతాయి. ఈ సమయంలో తీవ్రవాదులను పెంచిపోషించేదే ఐఎస్ఐ అన్న సంగతి అమెరికా రక్షణ శాఖ గుర్తించింది. అలాగే తీవ్రవాదుల అంతానికి ఆ దేశం తీసుకుంటున్న చర్యలు లేవని, అసలు తీవ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నదే పాకిస్థాన్ అని అమెరికా రక్షణ శాఖ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ నోటి వరకు వచ్చిన 6,121 కోట్ల రూపాయలను అమెరికా రక్షణ శాఖ నిలిపివేసింది.

More Telugu News