: మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్తున్నాం: ఆళ్ల

తనపై నమోదయ్యే కేసులు విచారణకు రాకుండా చేసుకుని తప్పించుకోవడం చంద్రబాబునాయుడికి అలవాటేనని వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఈ ఉదయం హైకోర్టులో ఆయనపై ఓటుకు నోటు విచారణ అక్కర్లేదని తీర్పు వచ్చిన తరువాత, ఆళ్ల ప్రసంగిస్తూ, ఈ విషయమై మరోసారి తాము సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్టు స్పష్టం చేశారు. గతంలో ఇటువంటి కేసులనే ఎదుర్కొన్న పీవీ, జయలలిత తదితరులు క్వాష్ పిటిషన్లను దాఖలు చేయలేదని గుర్తు చేస్తూ, చంద్రబాబు తప్పు చేయకుంటే క్వాష్ పిటిషన్ ఎందుకు వేశారని ప్రశ్నించారు. గతంలో పీవీ ఓటుకు నోటు కేసులో శిక్షను కూడా అనుభవించారని, ఇప్పుడు మాత్రం ఓట్లు కొంటే అవినీతి కిందకు రాదని బాబు తరఫు న్యాయవాది వాదించడం, దాన్ని హైకోర్టు సమర్థిస్తూ, తీర్పులో ఉటంకించడాన్ని తాము సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని అన్నారు. రెండేళ్ల నాడు నమోదైన కేసులో ఇంతవరకూ విచారణ జరగలేదని ఆరోపించారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుందనే భావిస్తున్నామని అన్నారు.

More Telugu News