: ఈ పక్షికి పార్వతీదేవి పళ్లు తినిపిస్తే...శివుడు ఎవరూ చంపలేరని వరమిచ్చాడట!

సోషల్ మీడియాలో గత పది రోజులుగా ఓ పక్షి ఫోటోతో పాటు ఆసక్తికరమైన కథనం హల్ చల్ చేస్తోంది. వాస్తవానికి దానిని పక్షిగా పేర్కొంటున్నప్పటికీ అది పక్షో, జంతువో అర్థంకాని పరిస్థితి నెలకొంది. దీనిని చైనీయులు డ్రాగన్ గా పేర్కొంటే, జపనీయుు పక్షి అంటున్నారు. నేపాలీలు మాత్రం అరుదుగా కనిపించే పక్షి అని అంటున్నారు. దీని పేరు హికు అని, ఇది అత్యంత అరుదుగా కనిపించే పక్షి అని, ఇది కనిపిస్తే అంతా మంచే జరుగుతుందని నేపాలీలు చెబుతున్నారు. ఇది నేపాల్ లో ఎక్కువగా కనిపిస్తుందని, చూసేందుకు చిత్రంగా ఉంటుందని చెబుతున్నారు. నాలుగు కాళ్లతో, నక్క, కొన్ని జాతుల కుక్కల పోలికలతో శరీరం నిండా దట్టంగా తెల్లటి వెంట్రుకలు, తోక, రెండు కొమ్ములు ఉండగా, దీని నడుం భాగం బాగా సన్నగా ఉండడం విశేషం. ఇది జపనీయులు, చైనీయుల పాటలు, వర్ణనల్లో కనిపిస్తుందని చరిత్రకారులు చెబుతున్నారు. అలాగే ఇది పురాణాల్లో కూడా ఉందని, ఈ హికు పక్షికి సాక్షాత్తూ పార్వతీదేవి అరటిపళ్లు తినిపించే వారని, మహా శివుడు దీనిని ఎవరూ చంపలేరంటూ వరమిచ్చారని వారు చెబుతున్నారు. అయితే ఇది కేవలం వర్షాకాలంలో మాత్రమే నేపాల్ లోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుందని, తరువాత హిమాలయాలకు వెళ్లిపోతుందని చెబుతున్నారు. ఇందులో వాస్తవాల సంగతి అటుంచితే, ఇదిప్పుడు వైరల్ అవుతోంది. మరికొందరు మాత్రం దీనిని ఫోటోషాప్ మాయాజాలంగా పేర్కొంటున్నారు.

More Telugu News