: మీరు ఆండ్రాయిడ్ యూజరా?... 'గూలిగాడు' వచ్చేశాడేమో చూసుకోండి!

మీరు ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ ఫోన్ ను వాడుతున్నారా? ఇటీవల ఏమైనా కొత్త యాప్ లు డౌన్ లోడ్ చేశారా? మీ సమాధానం 'అవును' అయితే, ఓ సారి మీ ఫోన్ ను పరీక్షించుకోండి. 'గూలిగాన్' అనే ప్రమాదకర వైరస్ వచ్చి వుండొచ్చు. సోషల్ మీడియాలో 'గూలిగాడు'గా పేరు తెచ్చుకున్న వైరస్ ఇప్పటికే 13 లక్షల ఫోన్లలోకి చొచ్చుకెళ్లింది. మూడు నెలల నుంచి ఈ వైరస్ తిరుగుతోందని, ఈ వైరస్ ఎక్కితే, జీ మెయిల్, డ్రైవ్, ఫోటోలు, ఇతర సమాచారం, బ్యాంకుల ఖాతాల వివరాలు, యూజర్ నేమ్, పాస్ వర్డ్ లు తదితర వివరాలన్నీ హ్యాకర్లకు చేరిపోతుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి కాకుండా, ఇతర యాప్ స్టోర్ల నుంచి ఏవైనా యాప్ లు డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేస్తే, ఈ వైరస్ ప్రవేశిస్తోందని 'వాల్ స్ట్రీట్ జర్నల్' హెచ్చరించింది. 'ట్రోజన్ హార్స్' వైరస్ మాదిరిగా ఇది దూసుకెళుతోందని, దీంతో జాగ్రత్తగా ఉండాలని 'ఫోర్బ్స్' పేర్కొంది. 86 రకాల యాప్ ల రూపంలో వైరస్ శరవేగంగా స్మార్ట్ ఫోన్లలో విస్తరిస్తోందని వెల్లడించింది.

More Telugu News