: స్వీపర్ పోస్టుకు ...ఎంబీఏ, ఇంజనీరింగ్, పీజీల పోటీ!

నిరుద్యోగ భారతదేశంలో వాస్తవాలకు అద్దంపట్టే పరిస్థితి ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో వెలుగు చూసింది. ప్రతి ఏటా లక్షలాది మంది విద్యార్థులు పట్టాలు చేతబట్టి యూనివర్సిటీలు, కళాశాలల నుంచి బయటపడుతున్నారు. ఉద్యోగాలు మాత్రం వందల సంఖ్యలోనే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో అలహాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కాంట్రాక్టు స్వీపర్ (సఫాయి కర్మచారీ) ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెల్లడైంది. దీంతో ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. స్వీపర్ ఉద్యోగానికి ఎంబీఏ, బీటెక్, పీజీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు బారులు తీరారు. 250 ఖాళీలు ఉండగా, 1.10 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడం విశేషం. ఈ ఉద్యోగాలకు కేవలం హిందీ రాయడం, చదవడం వస్తే సరిపోతుందని, అదే విద్యార్హత అని అలహాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. దరఖాస్తుదారులు భారీ ఎత్తున ఉండడంతో, అభ్యర్థులకు డ్రెయినేజీలు శుభ్రం చేయడం, రోడ్లు ఊడవడంలో ప్రాక్టికల్ పరీక్ష నిర్వహించాలని భావిస్తున్నామని అలహాబాద్ మున్సిపల్ అదనపు కమిషనర్ శ్రీవాస్తవ తెలిపారు.

More Telugu News