: నోట్ల రద్దు యజ్ఞంలో భాగమైన భారతీయులందరికీ నా సెల్యూట్: మోదీ

ఉగ్రవాదం, నల్లధనంపై యుద్దంలో భాగంగా ప్రారంభించిన నోట్ల రద్దు యజ్ఞంలో భాగమైన భారతీయులందరికీ సెల్యూట్ చేస్తున్నట్టు ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘‘ఉగ్రవాదం, నల్లధనం, అవినీతికి వ్యతిరేకంగా చేపట్టిన యజ్ఞంలో భాగస్వాములైన ప్రతి ఒక్క భారతీయుడికి మనస్ఫూర్తిగా సెల్యూట్ చేస్తున్నా’’ అంటూ ట్వీట్ చేశారు. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రధాని కొట్టిపడేశారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని నిరసిస్తూ విపక్షాలు గురువారాన్ని ‘బ్లాక్ డే’గా పాటించిన సంగతి తెలిసిందే. నోట్ల రద్దుకు నెల రోజులు పూర్తయిన సందర్భంగా గురువారం ప్రధాని వరుస ట్వీట్లు చేశారు. నోట్ల రద్దు నిర్ణయంతో దేశానికి వెన్నెముక లాంటి రైతులు, వ్యాపారులు, శ్రామికులకు మంచి ఫలితాలు అందుతాయన్నారు. నోట్ల రద్దుతో కొంతకాలం పాటు ప్రజలకు ఇబ్బందులు తప్పవని తాను ముందు చెప్పానని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్వల్ప కాలిక ఇబ్బందులు తప్పవని మోదీ పునరుద్ఘాటించారు.

More Telugu News